యోగా సాధనాతో సంపూర్ణ ఆరోగ్యం..
1 min read
మహానంది ,న్యూస్ నేడు: యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని యోగా శిక్షకురాలు వెంకటలక్ష్మి, రంగమ్మ , ఎంపీడీవో మహబూబ్ దౌలా పేర్కొన్నారు. బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో ఎంపీడీవో ఆద్వర్యంలో యోగా పై సీతారామపురం, మసీదుపురం, గోపవరం, గాజులపల్లె గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది కి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యోగ సాధన ద్వారా శరీరానికే కాకుండా, మనస్సుకు కూడా ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి యోగా సాధన ఎంతో ముఖ్యమన్నారు. నిత్యం యోగా సాధనతో అనేక రకాలైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది శేఖర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మహమ్మద్ ఇర్ఫాన్, వెంకటయ్య, సచివాలయ సిబ్బంది మల్లికార్జున, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
