ముగిసిన శిక్షణ తరగతులు…
1 min read– ముఖ్యఅతిథిగా విచ్చేసిన డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ ఆర్ హరి ప్రకాష్
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : రాష్ట్ర ఆడిట్ శాఖ సంచాలకుల ఆదేశాలనుసారం ఉభయ గోదావరి మరియు కృష్ణ జిల్లాల నుంచి జోన్ 2 ఏలూరు జిల్లాలో కెపాసిటీ బిల్డింగ్- ఫిజికల్ ట్రైనింగ్ (శిక్షణా తరగతులు) ఏలూరు మండల కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ముగింపు రోజు ముఖ్యఅతిథిగా డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్.ఆర్ హరి ప్రకాష్ విచ్చేసిన సందర్భంగా జిల్లా ఆడిట్ అధికారి పుష్పగుచ్చాలు అందించి శాలువా కప్పి ఆహ్వానం పలికారు,ఈ శిక్షణా తరగతులు రెండు రోజులు పాటు నిర్వహించారు,ఈ సందర్భంగా హరి ప్రకాష్ మాట్లాడుతూ పోస్ట్ ఆడిట్ స్థానంలో క్రియాడీట్ విధానాన్ని ప్రస్తుతం దేవాలయాలలో ప్రారంభించా మని,త్వరలోనే మున్సిపాలిటీలో కూడా క్రియాడీట్ విధానాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు,ఈ శిక్షణా తరగతులు స్టేట్ ఆడిట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి చిన్నపు రెడ్డి రెండు రోజులపాటు పాల్గొని శిక్షణ తరగతులను నిర్వహించారు, ఆయనకు కూడా జిల్లా ఆడిట్ అధికారి పుష్ప గుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు,ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ అధికారి ఏ వి ఆర్ గంగాధర రావు,మరియు కాకినాడ జిల్లా ఆడిట్ అధికారి బి చందర్రావు, ఎన్టీఆర్ జిల్లా ఆడిట్ అధికారి కె కృష్ణమోహన్,సహాయ ఆడిట్ అధికారులు,సీనియర్ ఆడిటర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.