కామ్రేడ్ కాజా హుస్సేన్ సంస్మరణ సభ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూల్ నగర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ కాజా హుస్సేన్ సంస్మరణ సభ ఈరోజు ఉదయం 11:30 గంటలకి సిపిఐ పార్టీ కార్యాలయం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సిపిఐ నగర కార్యదర్శి అధ్యక్ష వహించగా ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బిడ్డయ్య సీనియర్ నాయకులు జగన్నాథం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కామ్రేడ్ కాజా హుసేని ఈనెల 19వ తేదీ రోడ్డు ప్రమాదంలో మరణించడం పార్టీకి తీరనిలోటని కామ్రేడ్ కాజా హుస్సేని 19 94 నుండి పార్టీలో పనిచేస్తూ కర్నూలు నగరంలో పార్టీ విస్తరించడానికి ఎంతో కృషి చేశారని కర్నూలు నగరంలో పేదల కోసం కమ్యూనిస్టు పార్టీ చేసిన ఇండ్ల స్థలాల భూ పోరాటంలో అగ్రభాగాన ఉండి అనేక కేసుల్లో ఎదుర్కొని కమ్యూనిస్టు పార్టీ కోసం నిజాయితీగా నిబద్ధతతో పనిచేయడం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారికి కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా అండ ఉంటుందని కామ్రేడ్ కాజా హుస్సేనీ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కాజా హుస్సేన్ కుటుంబానికి భారత కమ్యూనిస్టు పార్టీగా 55 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కర్నూలు నగర పార్టీ ఇవ్వడం వారి కుటుంబానికి మనోధైర్యం నింపే విధంగా నగర పార్టీ సహాయం చేయడం జిల్లా పార్టీగా అభినందిస్తున్నారు భవిష్యత్తులో కుటుంబానికి అండదండగా ఉంటామని కుటుంబ సభ్యులకి హామీ ఇవ్వడం జరిగింది కామ్రేడ్ కాజా హుస్సేన్ సతీమణి అమినాబి కి జిల్లా పార్టీ కార్యదర్శి గిడ్డయ్య జగన్నాథం మునియప్ప రామకృష్ణారెడ్డి మహేష్ శ్రీనివాసరావు చంద్రశేఖర్ వెంకటేష్ గిడ్డమ్మ మల్లన్న అన్వర్ నాగరాజు బిసన్న చేతుల మీదుగా 55వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.