కడప నగర మేయర్‌కు శుభాకాంక్షలు
1 min read
సురేష్‌బాబుకు అభినందనలు తెలుపుతున్న అధికారులు , ప్రజలు
పల్లెవెలుగు వెబ్, కడప :కడప కార్పొరేషన్ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సురేష్‌బాబుకు మంగళవారం అభినందనలు వెల్లువెత్తాయి. 41 డివిజన్ డిప్యూటీ మేయర్ కుమారుడు డా. మురాద్, అడ్వకేట్ రాఘవ రెడ్డి, అంధుల అసోసియేషన్ సభ్యులు, కంప్యూటర్ ఆపరేటర్లు, హెల్త్, ఏపీ టిడ్కో అధికారులు, ప్రొద్దుటూరు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు, లైబ్రరీ సెక్రటరీ తదితరులు నగర మేయర్ సురేష్‌బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ సురేష్‌బాబును పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.