NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్మీ ఆస్పత్రిలో నా మీద కుట్ర

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి త‌న‌ను తొంద‌రగా డిశ్చార్జీ చేసేందుకు.. ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి కుట్రప‌న్నార‌ని ఆరోపించారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు. ఈమేర‌కు ఆయ‌న ర‌క్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. తితిదే జేఈవో ధ‌ర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి, కేపీ రెడ్డి క‌లిసి కుట్ర ప‌న్నార‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన అనంత‌రం పోలీసులు త‌నను అరెస్టు చేసేలా ప్లాన్ చేశార‌ని రాజ్ నాథ్ సింగ్ కు చెప్పారు. త‌న‌ను వెంట‌నే డిశ్చార్జీ చేసే విధంగా ఆర్మీ ఆస్పత్రి డాక్టర్ల మీద కేపీ రెడ్డి ఒత్తిడి తెచ్చార‌ని రఘురామ ఆరోపించారు. ఈ మొత్తం ఉదంతం మీద రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు.

About Author