‘రాజ్యాంగ’ హక్కులను సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ ప్రవీణ
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ : రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్. అంబేద్కర్ కల్పించిన హక్కులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు దేవనబండ సర్పంచ్ ప్రవీణ. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేవనబండ గ్రామములోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జెండాను ఆవిష్కరించారు.. ఈ వేడుకలలో గ్రామ సర్పంచు ప్రవీణ,విద్యా కమిటీ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి, పాఠశాల వైస్ చైర్మన్ జ్యోతి,MPTC మహాలక్ష్మి,వైసీపీ నాయకులు గాంధీ రెడ్డి,వైసిపి యువనాయకులు రంగనాథ్ రెడ్డి, ఉపసర్పంచు వీరన్న,గ్రామ పెద్దలు విశ్వనాథ రెడ్డి, రామేశ్వరరెడ్డి, జయరామిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ఉపాధ్యాయులు ప్రసాద్, సులోచనమ్మ,లలిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచు ప్రవీణ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు ఉపయోగించుకోవాలి అన్నారు.ముక్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన విద్యా సౌకర్యాలు ఉపయోగించుకొని ఉన్నత విద్యా భివృద్ది సాధించి మంచి ప్రగతి సాధించాలని ఆమె సూచించారు.సర్పంచు గారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ పెన్నులను పంపిణీ చేశారు.