సమిష్టి కృషితో రోడ్డు ప్రమాదాలు నియంత్రించండి : జిల్లా ఎస్పి
1 min readట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పై చర్యలు తప్పవు
జాతీయ రహాదారుల పై రాంగ్ రూట్ లలో వెళ్ళవద్దు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన చేసేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు తెలిపారు.గత వారం రోజులుగా (అక్టోబర్ 30 తేది నుండి నవంబర్ 05 వ తేది వరకు)జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం విడుదల చేశారు . ఇందులో ప్రధానంగావాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిపై 312 కేసులు.హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 1,866 కేసులు, మైనర్ల పై 3 కేసులు. ఒన్ వే లో రాంగ్ రూట్ వెళ్ళిన వారిపై 39 కేసులు. మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారి పై 139 కేసులు. ఏలాంటి రికార్డులు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి పై 2,062 కేసులు.అతి వేగంతో వెళ్లి న వాహనాల పై 499 కేసులు. ఓవర్ లోడ్ తో వెళ్ళిన వాహనాల పై మోటారు వాహనాల చట్టం కింద 91 కేసులు.త్రిబుల్ రైడింగ్ పై 195 మంది కేసులు. రాంగ్ పార్కింగ్ చేసిన ద్విచక్రవాహానాల పై 93 కేసులు.రాంగ్ పార్కింగ్ చేసిన త్రీ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహానాల పై 308 కేసులు.నంబర్ ప్లేట్ లేని వాహనాల పై 142 కేసులు. డ్రంకెన్ డ్రైవ్ క్రింద 2 కేసులు.మొత్తం 5 లక్షల 58 వేల ఈ – చలనాలు పెండింగ్ లో ఉన్నాయని ఈ వారంలో 11,687 ఈ – చలనాలను (రూ. 29 లక్షల 49 వేలు) రికవరీ చేశామన్నారు. జిల్లా మొత్తంలో 34 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించామన్నారు. ఆటో డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు , “స్టాప్ వాష్ అండ్ గో” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు, సూచనలు పాటిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా గమ్యాలకు క్షేమంగా చేరాలని, ప్రాణనష్టం జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఈ సంధర్బంగా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ర్పాటు చేశారు కానీ దేవస్థానం అధికారులు భక్తులకు అనుమతి లేకుండా చేశారు మల్లన్న భక్తులకు ప్రదక్షణ చేసుకునే మొక్కు తీర్చుకుందాం అనుకుంటారు కానీ శ్రీశైల మహా క్షేత్రంలో ప్రదక్షణ చేసుకుని దానికి అవకాశం లేకుండా అధికారులు ఎక్కడ చూసిన మాడవీధుల చుట్టూ పెద్ద గేట్లు వేసి భక్తులకు ప్రదక్షిణ లేకుండా చేశారు మరియు కోట గోడ మీద ఉన్న చారిత్రక శిల్ప ఆకృతులను చూడకుండా ఆలయ అధికారులు చేస్తున్నారని భక్తులు అంటున్నారు రోజుకు లక్షలలో దర్శించుకున్న తిరుమల మాడవీధుల్లో ప్రదక్షణ చేసుకునే అవకాశం ఉంది కానీ శ్రీశైల మహా క్షేత్రంలో అవకాశం లేకుండా చేస్తున్న అధికారులు ప్రదక్షణ చేసుకొనే దానికి తిరుమలలో లేని ఆంక్షలు మల్లన్న భక్తులకు ఎందుకు అని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్ణయం తీసుకుని భక్తులకు మాడవీధుల్లో ప్రదక్షిణ చేసుకునే అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.