NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్…

1 min read

నేరాల నివారణకు ప్రజలు సహకరించాలి

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఉత్తర్వుల మేరకు  కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూల్ నాల్గవ పట్టణ సిఐ మధు సుధన్ గౌడ్ , కర్నూలు సబ్ డివిజన్ ఎస్ఐలు,  సిబ్బంది,  హోంగార్డ్స్ తో కలిసి  కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని షరీన్ నగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్  నిర్వహించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్స్ , ట్రబుల్ మాంగర్స్ ఇళ్లల్లో తనిఖీలు చేశారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహన పత్రాలు సరిగా లేని  12  బైక్ లను  స్వాధీనం చేసుకున్నారు. షరీన్ నగర్ ప్రజలతో నాల్గవ పట్టణ సిఐ మధుసుధన్ గౌడ్   మాట్లాడుతూ … నేరాల నివారణకు  ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. చట్టవ్యతిరేక , అసాంఘిక కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలన్నారు.  ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *