కరోన పంజా: సచివాలయం ఉద్యోగి మృతి
1 min readపల్లెవెలుగు వెబ్, అమరావతి: కరోన తో ఏపీ సచివాలయం ఉద్యోగి మరణించారు. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసే పద్మారావు కరోన బారినపడి మరణించారు. దీంతో సచివాలయం ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. రెండో దశలో కరోన కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సచివాలయంలో ఇప్పటికే 50 మందికి పైగా కరోన పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తోంది. కరోన భయం కారణంగా ఉన్నతాధికారులు ప్రధాన కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తున్నారు.