NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌రోన ప్ర‌భావం.. శ్రీశైలం దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం !

1 min read

పల్లెవెలుగువెబ్ : క‌రోన కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో శ్రీశైలం దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్వామి వారి స‌ర్వద‌ర్శ‌నం నిలిపివేస్తున్న‌ట్టు ఈవో ల‌వ‌న్న తెలిపారు. అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌, పుణ్య‌స్నానాలు తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపారు. ఇక నుంచి రోజుకు నాలుగు విడ‌త‌ల్లో సామూహిక అభిషేకాలు ఉంటాయ‌ని చెప్పారు. ఈనెల 18 నుంచి ఆర్జిత సేవ‌ల టికెట్లు ఆన్ లైన్ లో పొందాల్సి ఉంటుంద‌ని, శీఘ్ర‌, అతిశీఘ్ర ద‌ర్శ‌నం టికెట్లు కూడ ఆన్ లైన్ లో పొందాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేష‌న్ కు క‌రోన వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి చేశారు.

                                        

About Author