PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనసేనానికి కరోన పాజిటివ్

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: ప్రముఖ హీరో , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు క‌రోన సోకింది. వైద్య ప‌రీక్షల అనంత‌రం ఆయ‌న‌కు క‌రోన పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇప్పటికే ప‌వ‌న్ భ‌ద్రతా సిబ్బందికి కూడ క‌రోన సోక‌డంతో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముంద‌స్తు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లోకి వెళ్ళారు. ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మొదట కరోన నెగిటివ్ వచ్చింది. కానీ కొన్ని రోజులుగా ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరోన పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

About Author