NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించాలి…

1 min read

న్యూస్ నేడు ఆలూరు :  ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బుసినే విరపాక్షి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం, వచ్చి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వలేదని అలాగే రైతులకు గిట్టుబాటు ధర,కల్పించకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే విరుపాక్షి కోరారు అలాగే జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల నాయుడు  దృష్టికి తీసుకువెళ్లామని కానీ ప్రయోజనం లేదన్నారు రైతుల గురించి వివరించి చెప్పిన పట్టించుకోలేదని అలాగే ఎంపీ కీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కీ చెప్పి ఎక్స్పోర్ట్, ఇప్పించాలని అడగండి అని తెలిపితే ఎంపీ కూడా పట్టించుకోలేదని రైతులను నట్టింట ముంచే విధంగా కుటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు నేను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు నుంచి ప్రతి ఒక్క అధికారిని మిర్చి రైతుల గురించి మాట్లాడిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక విద్యుత్ చార్జీలు భారీగా పెంచి ప్రజలను అలాగే రైతులను మోసం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు సర్పంచులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

About Author