NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత

1 min read

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి

ఏలూరు క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు అర్జీలు సమర్పించిన ప్రజలు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ప్రజల నుంచి అర్జీల రూపంలో వచ్చే సమస్యల పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా నిర్దేశించుకుని, అందుకు తగిన విధంగా ప్రణాళికతో పనిచేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీకి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు వినతుల రూపంలో తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను 70 శాతం పైగా పరిష్కరిస్తున్నామని, మిగిలిన సమస్యలు భూ వివాదాలకు సంబంధించిన అంశాలు కావడంతో జాప్యం జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల కోసం దిల్లీ వెళ్లిన సందర్భాల్లో తన కార్యాలయంలో నేరుగా వినతులు తీసుకునేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగుడు సమస్య తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఎంపీగా చట్ట సభలో అడుగు పెట్టిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న నాలుగేళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రమిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. అనంతరం పార్లమెంటు పరిధిలోని పామాయిల్ రైతులు ఎంపీ మహేష్ కుమార్ ను కలిసి తమ సమస్యల వివరించారు. పామాయిల్ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించే అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఎంపీ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు,ఇడా చైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు  మరడాని రంగారావు,ఏపీ ఎన్జీవోస్ అధ్యక్ష , కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్,నెరుసు రామారావు జిల్లా ఎస్సీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author