కరోన పరీక్ష.. కొత్త పద్ధతిలో శాంపిల్ సేకరణ
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన పరీక్షలకు సులువైన విధానాన్ని భారత శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గతంలో లాగ ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ముక్కు, గొంతులో నుంచి శాంపిల్ సేకరించకుండా.. సెలైన్ గార్గిల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పద్ధతిలో ఎలాంటి సాధనాలను ముక్కు, గొంతులోకి పంపాల్సిన అవసరం ఉండదు. ఇందులో సెలైన్ ద్రావకంతో కూడిన ఒక కలెక్షన్ గొట్టం ఉంటుంది. ఈ ద్రావకాన్ని పుక్కిలించి తిరిగి దానిని గొట్టంలోకి ఉమ్మాల్సి ఉంటుంది. దీనిని ల్యాబ్ కు పంపి గది ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక పదార్థంలో ఉంచుతారు. దీనిని వేడి చేస్తే ఆర్ఎన్ఏ టెంప్లేట్ ఒకటి బయటకు వస్తుంది. దీనిని ఆర్టీపీసీఆర్ పరీక్షకు పంపొచ్చు. నమూనా సేకరణ, ప్రాసెసింగ్ కోసం ఈ విధానాన్ని ఉపయోగంచడం వల్ల ఖరీదైన మౌలిక వసతుల అవసరం తగ్గుతుంది. ఈ పద్దతిలో వ్యర్థాలు తక్కువగా వెలువడతాయి, ఇది పర్యావరణ అనుకూలమైనదని శాస్ర్తవేత్త కృష్ణ ఖైర్నార్ తెలిపారు.