PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోడీ హటావో… దేస్కి బచావో అంటూ సీపిఐ బైక్ ర్యాలీ   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మోడీ హాటావో_ దేస్కి బచావో .. సేవ్ పబ్లిక్ సెక్టార్ సేవ్ డెమోక్రసీ అంటూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం పత్తికొండ లో బైక్ ర్యాలీ చేపట్టినది.ఈ నెల 9న జరుగు మహా పడావ్ కార్యక్రమం జయప్రదం చేయాలని కొరుతూ ఏఐటీయూసీ అధ్వర్యంలో  పత్తికొండ పట్టణం లో భారీగా బైక్ ర్యాలీని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య  ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ కూడలి నుండి పట్టణం లో ఆర్ &బి గెస్ట్ హౌస్ మరియు ఆర్ టి సి బస్టాండ్ నుంచి నాలుగు స్థంభాల వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్ కృష్ణయ్య,.సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్, వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి యం.కారన్న, ఏఐటియుసి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు జి. నెట్టికంఠయ్య, యం. రంగన్న ఏఐటీయూసీ తాలూకా గౌరవ అధ్యక్షులు బి .మాదన్న, ఏఐటీయూసీ తాలూకా గౌరవ కార్యదర్శి జి.గుండుబాషా, ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు యం. రాజప్ప, యం. రామచంద్ర గ్రామపంచాయతీ సంఘం నాయకులు కే.ఉచ్చురప్ప, కే.సంజన్న, గడ్ల రంగస్వామి యం. కే.సుంకన్న పెయింటర్స్ సంఘం నాయకులు బి.తిమ్మన్న, ఆది నారాయణ, బెల్దారు సంఘం నాయకులు రంగన్న, బీటి వీరేష్, హరి తదితరులు పాల్గొన్నారు.

About Author