ఉద్యోగులకు మద్దతుగా ఉద్యమంలోకి సీపీఐ
1 min readపల్లెవెలుగువెబ్ : పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న ఉద్యోగులకు మద్దతుగా సీపీఐ రంగంలోకి దిగనుంది. ఫిబ్రవరి 1,2 తేదీల్లో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ నేత జంగాల అజయ్ తెలిపారు. ఉద్యోగులను మోసం చేసిందే కాకుండా మంత్రులే బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదన్నారు. జిల్లాలో రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. రైతులను కనీసం పట్టించుకునే నాధుడే లేడన్నారు. రాజకీయాల్లో వినలేని భాషను మంత్రులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.