PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రికెట‌ర్ కొహ్లీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :భార‌త క్రికెట్ జ‌ట్టు కెఫ్టన్ విరాట్ కొహ్లీ కుమార్తె పై అత్యాచార బెదిరింపుల‌కు దిగాడో యువ‌కుడు. టీ20 ప్రపంచ క‌ప్ లో గ‌త నెల 24న పాకిస్థాన్ తో భార‌త్ ఓడిపోయిన వెంట‌నే ‘ క్రిక్ క్రేజీ గ‌ర్ల్ ’ పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ ద్వార విరాట్ కొహ్లీని బెదిరిస్తూ ఈ ట్వీట్ వెలువ‌డింది. క్షణాల్లో ఇది వైర‌ల్ గా మారింది. ఈ బెదిరింపుల పై ఢిల్లీ పోలీసుల‌తో పాటు ముంబై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి కేసు న‌మోదు చేసి.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు 23 ఏళ్ల రామ్ న‌గేశ్ గా గుర్తించారు. ఇత‌ను హైద‌రాబాద్ ఐఐటీలో ఇంజినీరంగ్ పూర్తీ చేసి కొంత‌కాలం ఓ ఫుడ్ డెలివ‌రీ యాప్ లో ప‌నిచేసిన‌ట్టు స‌మాచారం. సంగారెడ్డి జిల్లా ఎద్దుల మైలారం ఆయుధ క‌ర్మాగారం క్వార్టర్స్ లో ఉంటున్న అత‌న్ని పోలీసులు అరెస్టు చేశారు.

About Author