PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం

1 min read

– జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు, ఐపియస్
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి :
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐ పి ఎస్ గారు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ హాల్ నందు జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో నేర సమీక్షా సమావేశమును నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ గారు రహదారి భద్రాతా లో భాగంగా తీసుకొన్న చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించారు. నాన్ బెయిలబుల్ వారెంట్స్ పెండింగ్ కు గల కారణములు తెలుసుకొని, సబ్- డివిజన్ పరిధిలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్స్ ను త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు. చీటింగ్ కేసులకు సంబంధించిన ప్రతి కేస్ ఫైల్ ను స్వయంగా క్షుణ్ణంగా పరిశీలించి సదరు కేసులలో పోలీస్ అదికారులు దర్యాప్తు చేసిన విధానాన్ని పరిశీలించి, ఆ కేసులు పెండింగ్ లో ఉండుటకు గల కారణాలను తెలుసుకొని, సదరు కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయడానికి తీసుకోవలసిన చర్యలను, మెళకువలను దర్యాప్తు అధికారులకు సూచించారు. దర్యాప్తులో ఉన్న మర్డర్ కేసులు, రేప్ & పోక్సో కేసులు, ప్రాపర్టీ కేసులు, చీటింగ్ కేసులు, క్రైమ్ ఎగైనెస్ట్ వుమన్, మిస్సింగ్ కేసులు, 174 Cr.P.C కేసులు, పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్, రోడ్డు ప్రమాదాలు, ఈ-చలానా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్, స్పందన పిటిషన్ లపై మరియు డిపిఓ పెండింగ్ రిప్లై ఫైల్స్ పై సమీక్షించారు. POCSO, NDPS కేసుల దర్యాప్తు సమయములో సాధారణంగా జరిగే పొరపాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించారు. పోక్సో కేసులు, మహిళలపై జరుగుతున్న నేరాల పై ప్రత్యేక దృష్టి సారించి, కేసులు దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు సంబంధిత కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు.ప్రాపర్టీ కేసులు విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రాపర్టీ కేసులను త్వరితగతిన చేదించి బాధితులు నష్టపోయిన సొమ్మును రికవరీ చేసి వారికి న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులనుఆదేశించారు.విచారణ దశలో ఉన్న కేసులను త్వరితగతిన విచారించి, సంబంధిత కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసి త్వరగా నంబర్ పొందాలని అధికారులను ఆదేశించారు.

About Author