స్టాక్ మార్కెట్ ను భయపెట్టిన క్రూడ్ ఆయిల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలను క్రూడ్ ఆయిల్ భయపెట్టింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ జీవనకాల గరిష్ఠానికి చేరింది. దీంతో క్రూడ్ ఆయిల్ ఆధారిత స్టాక్స్ లో పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా పతనమైంది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయ మార్కెట్లు కూడ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వెరసి భారత స్టాక్ మార్కెట్ సూచీలు ప్రారంభమే భారీ గ్యాప్ డౌన్ తో ప్రారంభమయ్యాయి. 12గంటల సమయంలో సెన్సెక్స్ 1151 పాయింట్ల నష్టంతో 53182 వద్ద, నిఫ్టీ 310 పాయింట్ల నష్టంతో 15935 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.