NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రిప్టో అక్ర‌మాలు.. 49 కోట్ల ఫైన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌్రిప్టో క‌రెన్సీ నిషేధించాల‌ని దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలాంటి సంద‌ర్భంలో క్రిప్టో లావాదేవీలు నిర్వ‌హించే సంస్థ వ‌జీర్ ఎక్స్ పై ప్ర‌భుత్వం జ‌రిమానా విధించింది. ఇటీవల ఈ కంపెనీ రికార్డులను ప్రభుత్వ విభాగాలు పరిశీలించగా పలు అవకతవకలు వెలుగు చూశాయి. అందులో ప్రభుత్వ కళ్లు గప్పి రూ. 40 కోట్ల రూపాయల జీఎస్‌టీ ఎగ్గొట్టినట్టుగా అధికారులు గుర్తించారు. వజీర్‌ ఎక్స్‌ సంస్థ రూపాయలను తీసుకుని క్రిప్టో లావాదేవీలకు అనువైన డబ్ల్యూఆర్‌ఎక్స్‌గా మారుస్తుంది. అదే విధంగా డబ్ల్యూఆర్‌ఎక్స్‌ని రూపాయలుగా మార్చే సేవలు అందిస్తోంది. ఇందు కోసం కమీషన్‌ వసూలు చేస్తోంది. ఇలా కమీషన్‌ సేవలకు సంబంధించి 18 శాతం పన్నును చెల్లించాల్సి ఉంది. అయితే వజీర్‌ ఎక్స్‌ ఈ పని చేయలేదు. ఫైన్ తో స‌హా మొత్తం 49 కోట్ల రూపాయలు క‌ట్టాల్సి ఉంది.

                                    

About Author