శ్రీశైలంలో సాంస్కృతిక నిత్యకళారాధన..
1 min read

శ్రీశైలం, న్యూస్ నేడు: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (22.10.2025) శ్రీభ్రామరీ కూచిపూడి డాన్సు అకాడమీ, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్యకార్యక్రమం ఏర్పాటు చేయబడింది.ఈ కార్యక్రమములో వినాయకకౌత్వం, తాండవనృత్యం, నమశ్శివాయతే, శివపంచాక్షరి, శివమంగళాష్టకం తదితర గీతాలకు స్తోత్ర, సౌమ్య, కాంచన తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారుకాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ.

