శ్రీ మఠంలో బలిపాడ్యమి వేడుకలు
1 min read

మూల రాములకు మహా పంచామృతాభిషేకంతో పూజలు
మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో బలిపాడ్యమి వేడుకలు మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బలిపాడ్యమిని పురస్కరించుకుని పీఠాధిపతులు మూల రాములకు మహా పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూలరాములకు ,దిగ్విజయరాములకు,జయరాములకు పవిత్ర గంధ లేపన చేశారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని , రాఘవేంద్రస్వామి ఘూల బృందావనాన్ని దర్శించుకున్నారు భక్తులకు పీఠాధిపతులు మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.

