యువగళం పాదయాత్రకు దళిత యువత కదలి రావాలి
1 min readఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాద యాత్ర కు దళిత యువత కదలి రావాలి అని శ్రీశైలం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం పిలుపు నిచ్చారు.ఆత్మకూరు పట్టణంలో శనివారం బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధ్వర్యంలో నారా లోకేష్ పాద యాత్ర కోనసాగుతుందని చెప్పారు.రాజ్యాంగ బద్దంగా దళితుల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాల్సిన ఎస్సీ నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పక్క దారి మళ్లించి దళితులకు తీరని అన్యాయం చేశారు.నాలుగేళ్ల కాలంలో ఒక్క పైసా ఖర్చు చేసిన దాఖలాలు లేవని అన్నారు దళితులపై దాడులు ,మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాయుడు దళిత యువతకు వేల కోట్లు రూపాయల వ్యయం చేసి ఆర్థికంగా బలోపేతం చేశారని తెలిపారు.ఎస్సీ నిధులపై నారా లోకేష్ కచ్చితమైన హామీ ఇచ్చే అవకాశం ఉందనీ,దళితుల సమస్యల పరిష్కారం నిమిత్తం నారా లోకేష్ మాట్లాడుతారని పేర్కొన్నారు 2024 లో తెదేపా ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.నారా లోకేష్ పాద యాత్ర లో దళిత యువత పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.