NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళితవాడ దళిత పంచాయితే మా అజెండా..

1 min read

–  మా దళితవాడను మేమే పాలించుకుంటాం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ & అంబేద్కర్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకులు పివి సునీల్ కుమార్ శుక్రవారం నంద్యాల జిల్లాకు   విచ్చేసిన సందర్భంగా  జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దిలీప్ రాజు  కలిసి దళితుల సమస్యలను వివరించారు.   నందికొట్కూరు పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పొలీస్ శాఖలలోని వివిధ రంగాలలో  ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించాలన్నారు.  అలాగే రాష్ట్రస్థాయి పోలీస్ డిపార్ట్మెంట్లో  ఎస్సీ ఎస్టీల కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేకత వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ లో  ఎస్సీ ఎస్టీ పోలీసు అధికారులు మాత్రమే ఎక్కువకాలం సస్పెన్షన్ గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విధుల్లో ఏదో చిన్న పొరపాటు జరిగితే ఎస్సీ ఎస్టీ అధికారులను బలి చేయడం తగదని పేర్కొన్నారు.  దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ ఎస్టీ పేద ప్రజల జీవన విధానాలు మార్చేలా పోలీస్ శాఖ నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో ఎక్కడ రాజీ పడే అవకాశం ఇవ్వకుండా చూడాలని , దళితుల అభ్యున్నతి కోసం వారి ఎదుగుదల కోసం అహర్నిశలు కష్టపడతు ప్రభుత్వానికి పోలీస్ శాఖకు  ఎల్లవేళలా సహకరిస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డాక్టర్ రాజు , నందికొట్కూరు మాల మహానాడు అధ్యక్షుడు నాగేష్  దేవ సహాయం, పరుశురాముడు, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

About Author