సమాచార & పౌరసంబంధాల శాఖ విశ్రాంత పబ్లిసిటీ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ మరణం
1 min read
40సంలు సమాచార శాఖలో విశిష్ట సేవలు
సమాచార శాఖ,ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రింట్ & ఎల్ట్రానిక్ మీడియా నివాళులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సమాచార & పౌరసంబంధాల శాఖలో పబ్లిసిటీ అసిస్టెంట్‌గా విశిష్ట సేవలందించిన బి. లక్ష్మీనారాయణ ఆదివారం తెల్లవారుజామున పరమపదించడం విషాదకరం.ఆయన శాఖలో ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సహోద్యోగుల అభిమానాన్ని చూరగొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్రమైన దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.బి.లక్ష్మీనారాయణ కి భావపూర్వక నివాళులు ఏలూరు జిల్లా సమాచార శాఖ సిబ్బంది, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రింట్ మరియు ఎల్ట్రానిక్ మీడియా నివాళులు తెలియజేసారు.

