రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోంది
1 min readఅబాసూపాలవుతున్న పోలీసులు 5 ఏళ్లు ఉండే పాలకులకోసం
వత్తాసు పలుకుతున్న కొందరు పోలీసులు బీసివై కార్యకర్తలను చెప్పుతో కొట్టిన పోలీస్ అధికారి ని సస్పెండ్ చెయ్యాలి
అధికార పార్టీ కి త్వరలోనే బుద్దిచెప్పుతారు
భారతచైతన్య యూవజన పార్టీ రాష్ట్ర సమన్వయ సారధి.
ఆర్.కె యాదవ్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన రాజ్యమేలుతోందని, సీఎం జగన్ ను చూసుకొని పోలీస్ శాఖ రెచ్చిపోతోందని బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్కే యాదవ్ ఆరోపించారు. శనివారం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ, పుంగనూరులో ధర్మ పోరాట సభను అడ్డుకొనే సందర్భంలో శుక్రవారం భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థపాక జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ మీద పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు,కార్యకర్తలపై దాడికి పునుకోవటంలాంటి సంఘటనలను చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని సందేహం వ్యక్తం అవుతుందని అన్నారు. నిజాతిగా పనిచేస్తున్న పోలీస్ అధికారులు విధినిర్వహణలో భాగంగా అధికార పార్టీకి చెందిన కొంత మంది నేతల చేత దాడులకు గురయ్యారని, అలాంటి వారిపై మీ ప్రతాపం చూపండని అన్నారు.శాంతి యూతంగా నిర్వహించతలపెట్టిన పుంగనూరు ధర్మ పోరాట సభను అడ్డుకోవటమే కాకుండా క్రమశిక్షణ కలిగిన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ పై పోలీసులు ప్రవర్తించిన తీరును చూసి ప్రజలు పెద్ద ఎత్తున్న ఖండిస్తున్నారని తెలిపారు.అంతే కాకుండా కార్యకర్తలను విచక్షణ రహితంగా ఇడ్చికెళ్లి, చెప్పుతో కొట్టడం, బలవంతంగా జీపు లోకి తోస్తూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్రమ కేసులను బనాయించటం సహించరాని విషయం అని అన్నారు. బీసీవై పార్టీ నిర్వహించితలపెట్టాలని భావించిన ప్రతిసారి సభలను అడ్డుకోవటం చూస్తే అధికార పార్టీకి, పుంగనూరులోని పాలకులకు ఓటమి భయం చుట్టుకుందన్న విషయం స్పష్టమవుతుందని అన్నారు. ఐదు సంవత్సరాలు ఉండే పాలకుల కోసం పోలీసు అధికారులు ఊడిగం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు తమ విధులను గుర్తుతెరిగి నడుచుకోవాలని సూచించారు.బిసివై పార్టీ కార్యకర్తను చెప్పుతో కొట్టిన పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. అలా కాని ఎడల మున్ముందు బి సి వై పార్టీ చేపట్టే ఆందోళనలకు పోలీసు శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.