దేవనకొండ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
1 min read
అశాస్త్రీయంగా కరువు మండలాలప్రకటన సిపిఎం
పత్తికొండ, న్యూస్ నేడు: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల ప్రకటన అశాస్త్రీయంగా ఉందని దీనివల్ల చాలా మండలాలకు అన్యాయం జరిగిందని దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా వెంటనే ప్రకటించాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నాడు స్థానిక తాసిల్దార్ కు రైతులతో కలిసి సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్ మండల కమిటీ సభ్యులు అశోక్ ,యూసుఫ్ భాషలు మాట్లాడుతూ, ఖరీఫ్ మరియు రభి సీజన్లో మండల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, అకాల వర్షాలు తుఫాన్లు నేపథ్యంలో సరైన దిగుబడి రాక భారీగా మండల రైతాంగం నష్టానికి గురైందని పేర్కొన్నారు. వేరుశనగ , మిరప,పప్పు సెనగ రైతులు కనీసం పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొందని వేరుశనగ ఎకరాకు మూడు నాలుగు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చిందని పెట్టుబడి మాత్రం 40 వేలకు దాటిందని పేర్కొన్నారు మిర్చి రైతుని కదిలిస్తే కన్నీలేనని ఎంతో ఆశతో సాగుచేసిన మిరప దిగుబడిలో నష్టం అదేవిధంగా గిట్టుబాటు ధర లేక మిరప రైతు అప్పుల్లో కూరుకు పోయాడని పేర్కొన్నారు పప్పు శనగ పరిస్థితి అద్వానంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో దేవనకొండ మండలాన్ని కరువుగా ప్రకటించి మండల రైతాంగానికి ఎకరాకు 50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు ప్రకటన లో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని, నిత్యం కరువుకు గురవుతున్న మండలాన్ని విస్మరించడం తగదని అన్నారు. పక్కన ఉన్న పత్తికొండ, క్రిష్ణగిరిలో కరువు ఉండి దేవనకొండలో పరిస్థితి బాగా ఉందనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మండలంలోని పైతట్టు గ్రామాలు వర్షాబావ పరిస్థితిలో తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు.