NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమావాస్య సందర్భంగా దేవరగట్టులో భక్తుల సందడి

1 min read

శ్రీ మాళమల్లేశ్వర స్వామివారికి విశేష పూజలు – భక్తులకు అన్నదానం

హోళగుంద న్యూస్ నేడు: దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.అమావాస్యను పురస్కరించుకుని శ్రీ మాళమల్లేశ్వర స్వామివారికి అభిషేకం, బిల్వార్చన, బండారు అర్చన వంటి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి శాకాంబరీ ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చన, ఆకుపూజ తదితర ప్రత్యేక పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జయమల్లప్ప స్వామి, మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు కుంకుమ, బండారు అందిస్తూ ఆశీర్వాదాలు అందించారు.అమావాస్య సందర్భంగా దేవరగట్టుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. స్వామివారి దర్శనం అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.శ్రీ మాళమల్లేశ్వర స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

About Author