NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధే.. ప్రభుత్వ ధ్యేయం

1 min read
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డా. సుధాకర్​

మాట్లాడుతున్న ఎమ్మెల్యే డా. సుధాకర్​

రూ.24లక్షలతో ఆర్టీసీ బస్టాండ్​ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్​, గూడూరు: గూడురు పట్టణంలో శిథిలావస్థకు చేరిన బస్టాండ్​ నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే డా. సుధాకర్​ రూ. 24లక్షలతో భూమిపూజ చేశారు. పాలక మండలి సభ్యులతో పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే… అభివృద్ధి.. సంక్షేమం.. ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గూడురు పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని, సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి పాలనలో సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయించడం ఎంతో ఆనందంగా ఉందని, గూడూరు నగర పంచాయతీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు కృషి చేస్తానని చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ భాస్కర్, వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పీఎన్.అస్లాం, ఎల్. వెంకటేశ్వర్లు , నగర పంచాయతీ కౌన్సిలర్ సభ్యులు కలాం భాష, దస్తగిరి, పద్మావతి, మల్లేశ్వరి, కుమార్, డ్రైవర్ మద్దిలేటి, ఉరుకుంద అమ్మ, పత్తి రంగడు, పెంచికలపాడు మహబూబ్ బాషా, రాముడు, గూడూరు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author