PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న హయాంలోనే పత్తికొండ అభివృద్ధి సాధ్యం 

1 min read

స్పష్టం చేసిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి                                                             

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే పత్తికొండ ప్రాంత అభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం పత్తికొండ మండలం హోసూర్ గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు పలుకుతున్న చంద్రబాబు స్థానిక నేతలు చీటీలు రాసిస్తే అది నిజమా కాదా అని కూడా విచారించకుండా ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం సిగ్గుచేటని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విరుచుకుపడ్డారు.మూడుసార్లు చంద్రబాబు పాలనలో, డిప్యూటీ సీఎంగా కే ఈ కృష్ణమూర్తిగారు చేయలేని అభివృద్ధిని చేసి చూపించిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. పత్తికొండ మండలం హోసూరులో 10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన పనులను ఆమె  ప్రారంభించారు. రూ7.20 కోట్లతో హోసూర్ నుండి మొలగవెల్లి నూతన రహదారి, రూ 41.60 లక్షలతో నిర్మించిన రెండు విలేజ్ హెల్త్ క్లినిక్లను, రూ 48.00 లక్షలతో నిర్మించిన రెండు రైతు భరోసా కేంద్రాలను, జలజీవన్ మిషన కింద 74 లక్షల తో పూర్తయిన ఇంటింటి కొళాయి పనులు,60,000 వేల నీటి సామర్త్యం కలిగిన ఒక మంచి నీటి ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు మాట్లాడుతూ, హోసూరును టిడిపికి కంచుకోట అని చెప్పుకుని ఓటు బ్యాంకుగా వాడుకున్న టిడిపి నేతలకు ఇక్కడ జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.అభివృద్ధి గురుంచి మాట్లాడుతున్న టిడిపి నేతలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దూదేకొండ నుండి కొత్తపల్లి వరకు, హోసూరు నుండి కొట్టాల వరకు,తుగ్గలి మండలం రాతన నుండి రాతన కొత్తూరు గ్రామం వరకు, శభాష్ పురం నుండి పై చింతలకొండ గ్రామం వరకు, పగిడిరాయి నుంచి కలచట్ల వరకు, వెల్దుర్తి మండలంలో టోల్గేట్ నుండి గుంటుపల్లి గ్రామం వరకు, గోవర్ధనగిరి క్రాస్ నుండి పేరాములకు గ్రామం వరకు, గోవర్ధనగిరి క్రాస్ నుండి ఎల్ కొట్టాల గ్రామం వరకు, గోవర్ధనగిరి నుండి లక్ష్మీపల్లి గ్రామానికి, వెల్దుర్తి నుండి రామళ్ళకోటకు డబల్ రోడ్డు, మండల కేంద్రమైన వెల్దుర్తిలో 30 పడకల ఆసుపత్రి, క్రిష్ణగిరి  మండలంలో చుంచు ఎర్రగుడి గ్రామం నుండి రేగులపాడు బ్రిడ్జి , లక్కసాగరం క్రాస్ నుండి తెగదొడ్డి గ్రామం వరకు , మద్దికేర నుండి బొజ్జనానిపేట వరకు వేసిన కొత్త రోడ్లు లింకు రోడ్లు వైసీపీ ప్రభుత్వం హయాంలో వేసామన్నారు.హోసూరు నుండి కొట్టాల వరకు రోడ్డు వేసేందుకు ప్రభుత్వం 7.2 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ బ్రిడ్జి ఎక్కువగా ఉండటం వల్ల నిధులు సరిపోలేదని, అవసరమైన నిధులు మరల మంజూరు చేయించి మిగిలిన రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఆమె గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇసుక దందా,జాబు కోసం డబ్బులు తీసుకున్నారని అనవసరంగా ఆరోపణలు చేస్తూ లబ్ది పొందాలని చిల్లర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే తాను చేసిన అవినీతిని నిరూపించాలని టిడిపి నేతలకు సవాల్ విసిరారు. 68 చెరువుల పనులు ఎవరి హయాంలో ఎంత చేసామో ఆధారలతో సహా చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని సవాలు విసిరారు. అనంతరం హోసూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు తిక్కన్న కుటుంబానికి 7 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే శ్రీదేవి  అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, హోసూరు గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author