NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

1 min read

– టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి   స్పష్టం చేశారు. ఒక్క పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు.  బుధవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నందికొట్కూరు పట్టణంలోని 7వ వార్డులో టీడీపీ మైనార్టీ నాయకులు జమీల్ ,రసూల్ ఖాన్ ల ఆధ్వర్యంలో   ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు ,కాలనీ వాసులు మాండ్ర శివనందా రెడ్డి కి గజమాల తో స్వాగతం పలికారు.  అనంతరం ఆయన  ప్రజలకు టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వివరించి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే టిడిపి అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే పథకాల గురించి వివరించి బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ బాండ్లను అందజేశారు. వైసీపీ పాల నలో రాష్ట్ర సర్వనాశనమైందని, పేద ప్రజలపై జగన్‌ అదనపు భారాలు మోపారని విమర్శించారు.కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి,   ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య, టీడీపీ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి,  మైనార్టీ సెల్  రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్, టీడీపీ నాయకులు జాకీర్, ఐ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి మూర్తుజావలి, బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి ,పగిడ్యాల  మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి, పల్లె రఘురామి రెడ్డి, టీడీపీ నాయకులు నరసింహా రెడ్డి, పాలమర్రి నాగరాజు, కళాకర్, నిమ్మకాయల మోహన్ , నిమ్మకాయల రాజు, బొల్లెద్దుల చిన్న రాజన్న , తదితరులు పాల్గొన్నారు.

About Author