శివ భక్తులకు సేవ చేసినందుకు…
1 min read
కర్నూలు : మహాశివరాత్రి, ఉగాది పండుగల సందర్భంగా కర్ణాటక నుంచి కాలినడక వెళ్లే భక్తులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు నేత్రదానాలపై అవగాహన కల్పించినందుకు సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్యని రాష్ట్ర మంత్రి వర్యులు టీ.జీ.భరత్ జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ భాషా కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ప్రశంసా పత్రంతో సన్మానించారు. ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్య మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేత్రదానాలపై అవగాహన కల్పించామని, ప్రశంస పత్రం రావడం సంతోషంగా ఉందన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు మంత్రి టి.జి. భరత్, ఎంపీ నాగరాజు ప్రోత్సహించారన్నారు.