NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోర్టు నూతన భవన నిర్మాణం కోసం  స్థల పరిశీలన 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:   పత్తికొండ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు నూతన భవన నిర్మాణం కోసం స్థలాన్ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పరిశీలించారు. శనివారం స్థానిక మన్రో బావి సమీపంలో ఉన్న స్థలాన్ని పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి జోత్స్న దేవితో కలిసి జిల్లా సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పరిశీలించి మాట్లాడారు. జిల్లా జడ్జి కబార్ది ఆదేశాల మేరకు  పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు నూతన భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి నివేదికలను జిల్లా జడ్జికి అందజేస్తామని వివరించారు. ఈయన వెంట పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు, న్యాయవాది దామోదరాచారి ఉన్నారు.

About Author