PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రముఖ శైవక్షేత్రాలు వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకూడదు

1 min read

– శైవ క్షేత్రాలు వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
పల్లెవెలుగు వెబ్ భీమవరం : శివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి శివరాత్రి ఏర్పాట్లపై భీమవరం ఆర్డీవో, భీమవరం, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్లు, పాలకొల్లు, ఆచంట, పెనుమంట్ర, నరసాపురం, భీమవరం తాసిల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్, ఫైర్, పంచాయతీ, మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖంగా ఉన్న శైవక్షేత్రాలు వద్ద భక్తులకు ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏర్పాట్లపై ముందుగా కార్యచరణ రూపొందించుకుని పక్కగా అమలు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాలను ముందస్తుగా గుర్తించి ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు వేరువేరుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు, పార్కింగ్ ప్రదేశాలను చూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ ప్లాన్ ను పక్కాగా అమలు చేయాలని, కాలినడకన దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు మార్జిన్ లో వాహనాలను నిలుపుదలను ఎట్టి పరిస్థితులను అనుమతించరాదని ఆదేశించారు. టోవింగ్ వెహికల్స్ ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వాతావరణంలో వేడి పెరిగినందున సాధ్యమైనంత ఎక్కువ త్రాగునీటి పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే దేవాలయాల పరిసర ప్రాంతాల్లో, పార్కింగ్ ప్రదేశాల్లో తాత్కాలిక టాయిలెట్స్, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి 108 వాహనాలను లను సిద్ధంగా ఉంచాలన్నారు. దర్శనాలకు ఎక్కువ సమయం క్యూలైన్లలో ఉండే అవకాశం ఉన్నందున, దర్శనం ముగించుకొని బయటికి వచ్చే పసిపిల్లల తల్లులు, వృద్ధులు కొంత సమయం విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక కాబిన్స్ ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్ధ్యం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని మున్సిపల్ కమిషనర్లును, పంచాయతీ అధికారిని ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో భీమవరం భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి, ఆచంట రామేశ్వర స్వామి, లక్ష్మణేశ్వరం శివాలయం, పెనుమంట్ర నత్తా రామేశ్వర స్వామి తదితర శైవ క్షేత్రాలు ప్రముఖంగా వున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ సూర్య తేజ, డి ఎం అండ్ హెచ్ ఓ మహేశ్వరరావు, డిపిఓ శ్రీమతి ఎం నాగ లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

About Author