డిజిటల్ ఎకానమీ.. ఓ బంగారు బాతు !
1 min readపల్లెవెలుగువెబ్ : డిజిటల్ ఎకానమీ ఓ బంగారు బాతు వంటిదని అమెరికా-భారత్ వ్యాపార మండలి చీఫ్ అతుల్ కేశప్ అభివర్ణించారు. ఈ రంగం నిరంతరం బలోపేతమవడానికి, వృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థలు, నిబంధనలు, చట్టపరమైన నియంత్రణలను అమెరికా, భారత దేశాల్లో ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశంలో పెను విప్లవం జరుగుతోందని, దీని ప్రభావం భారత దేశం, అమెరికాలతోపాటు యావత్తు ప్రపంచంపైనా పాజిటివ్ గా ఉంటుందన్నారు. అనేక శతాబ్దాల అంతరాయాల తర్వాత భారత దేశం తిరిగి తన చారిత్రక హోదాకు వస్తోందన్నారు.