యువనేత లోకేష్ ను కలిసిన దివ్యాంగులు
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడులో దివ్యాంగులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.దివ్యాంగులకు రూ.6వేలు పెన్షన్ ఇవ్వాలి.దివ్యాంగులకు ఆర్టీసి బస్సుల్లో 50శాతం రాయితీ ఇవ్వాలి.వెలుగోడు మండలంలో దివ్యాంగులకు ఇళ్లస్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి.బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు మంజూరు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దివ్యాంగులను తీవ్ర నిర్ల్యక్ష్యం చేయడమేగాక రకరకాలుగా వేధిస్తోంది.దివ్యాంగులకు ఎప్పటినుంచో ఇస్తున్న పెన్షన్లను కుంటిసాకులతో రద్దుచేస్తోంది.టిడిపి హయాంలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.6,500 కోట్ల రూపాయలు ఖర్చుచేశాం.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల కార్పొరేషన్ కు నిధులిచ్చి, సబ్సిడీ రుణాలను అందజేస్తాం.ఆర్టీసి బస్సుల్లో దివ్యాంగులకు రాయితీ కల్పిస్తాం.