ఐటీడీఏ కు… ఫారెస్ట్ కు మధ్యన వివాదం
1 min readపల్లెవెలుగు , వెబ్ మహానంది : ఐటీడీఏ అధికారులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వివాదం కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం .మహానంది సమీపంలోని తెలుగు గంగా ప్రధాన కాలువ ఆనుకొని గిరిజనులకు దాదాపు 62 ఎకరాలు భూమిని పోడు వ్యవసాయం క్రింద పట్టాలు మంజూరయ్యాయి .కానీ రిజర్వ్ ఫారెస్ట్ లో నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిలో ఓ కంపెనీ ఆధ్వర్యంలో ఫెన్సింగ్ వేసి ఉద్యానవన పంటలు సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం .మూడు సంవత్సరాలు కాలం తర్వాత సంబంధిత గిరిజనులకు ఆ కంపెనీ అప్పగించనున్నట్లు తెలుస్తోంది .ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర కార్యక్రమాలు చేపట్టవద్దని ఆర్ ఓ ఎఫ్ ఆర్ నిబంధనల మేరకు అక్కడ నడుచుకోవాలని ఫారెస్ట్ అధికారులు మరియు సిబ్బంది సూచిస్తున్నారు .ఫెన్సింగ్ ఏర్పాటు అనుమతులు లేవని అలాంటివి ఉంటే ఏవైనా చూపించాలని వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోతామని స్థానిక ఫారెస్ట్ అధికారులు సూచించినట్లు తెలుస్తుంది .కొన్ని అటవీ ప్రాంతంలోని గిరిజనులు నివసించే ప్రాంతాల్లో ఓ కంపెనీ పోడు వ్యవసాయం లో భాగంగా గిరిజనులకు వారికి కేటాయించిన వ్యవసాయ భూమిలో ఫెన్సింగ్ వేసి పంటలను సాగు చేసి మూడు సంవత్సరాల తర్వాత అభివృద్ధి అనంతరం వారికి అప్పగించినట్లు సమాచారం దీనిపై అటవీశాఖ అధికారులు మాత్రం ఆర్ ఓ ఎఫ్ ఆర్ నిబంధన ప్రకారమే నడుచుకుంటామని వెల్లడించినట్లు తెలుస్తోంది .మహానంది సమీపంలోని తెలుగు గంగా కాలువ పక్కన ఉన్న గిరిజనులకు కేటాయించిన వ్యవసాయ భూమి నందు వేయాలని చూస్తున్న ఫెన్సింగ్ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ శాఖ వర్గాల ద్వారా తెలిసింది .అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆ ప్రాంతంలో నిఘా ఉంచినట్లు అటవీ శాఖ వర్గాలు తెలిపాయి.