NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌ఘురామ‌కృష్ణరాజు పై అన‌ర్హత వేటు ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు పై అన‌ర్హత వేటు వేయాల‌ని గ‌తంలోనే వైసీపీ లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీలో గెలిచి .. ప్రతిప‌క్ష పార్టీకి మ‌ద్దతుగా మాట్లాడుతున్నార‌ని స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా మ‌రోసారి రఘురామ పై వైసీపీ నేత‌లు స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశారు. రఘురామ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని స్పీక‌ర్ కు లేఖ రాశారు. గ‌తేడాది జులై 3న స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశామ‌ని, అన‌ర్హత వేటు వేయ‌కుండా ఆల‌స్యం చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు లేఖ‌లో పేర్కొన్నారు. చాలా సార్లు వ్యక్తిగ‌తంగా క‌లిసి ఫిర్యాదు చేశామ‌ని, అయినా స‌రే అన‌ర్హత వేటు వేయ‌క‌పోవ‌డం దుర‌దృష్టక‌ర‌మ‌ని వైకాపా పార్లమెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయి రెడ్డి లేఖ‌లో పేర్కొన్నారు.

About Author