రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ…
1 min read
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది… మండల కూటమి నాయకులు..
హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం నందు గురువారం రైతులకు సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్ దళ్ మాట్లాడుతూ సబ్సిడీ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న 18 మంది రైతులకు సబ్సిడీపై హోండా పవర్ స్ప్రేయర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, కూటమి నాయకులు మాట్లాడుతూఆలూరు తెదేపా ఇన్చార్జి వీరభద్ర గౌడ్ ఆదేశాలతో రైతులకు సబ్సిడీ కింద మందు పిచికారి స్ప్రేయర్లను అందించడం జరిగిందని అన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పంపాపతి, అబ్దుల్ సుభాన్, దిడ్డి వెంకటేష్, ఎర్రి స్వామి,వీరన్న గౌడ్,మోయిన్, బాగోడి రాము, చిదానంద, ప్రసాద్, మహేష్, జనసేన కన్వీనర్ అశోక్, వరాల వీరేష్, కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
