జగనన్న గోరుముద్ద పథకంలో రాగి జావ పంపిణీ
1 min read– ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
– విద్యార్థిని,విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ లో జగనన్న పథకం ద్వారా రాగి మాల్ట్ కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి విద్యార్థినిలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థినీ విద్యార్థులు చదువుకోవాలనే లక్ష్యంతోనే అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 15 వేల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని లక్ష్యంతోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ లో పలు మార్పులు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఎండాకాలం ప్రారంభం కావడంతో విద్యార్థిని విద్యార్థులు పౌష్టికంగా ఉండాలని ఉద్దేశంతోనే రాగి మాల్ట్ ను అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమం వారంలో మూడు రోజులపాటు అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పదవ తరగతి చదువుతున్న బనగానపల్లె నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులందరూ మంచి మార్కులు సంపాదించాలని తమ నియోజకవర్గానికి, తనకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థిని, విద్యార్థులకు అందరికీ ఆల్ ది బెస్ట్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి శివరామయ్య, మండల విద్యాశాఖ అధికారిని స్వరూపారాణి, బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, రోడ్లు భవనముల శాఖ డివిజనల్ ఇంజనీర్ సునీల్ రెడ్డి, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.