PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టెన్ని కోయిట్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ

1 min read

ప్రముఖ వైద్యుడు డాక్టర్ శంకర్ శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరగనున్న 41వ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి టెన్ని కాయిట్ పోటీలకు ఎంపికైన కర్నూలు జిల్లా సీనియర్ పురుషుల మరియు మహిళల జట్లకు నగరంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ శంకర్ శర్మ క్రీడా దుస్తులు బహుకరించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలలో రాణించి జాతీయస్థాయికి ఎంపికయ్యేల కృషి చేయాలన్నారు. క్రీడాకారులకు ప్రోత్సహించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు క్రీడల వలన ఒత్తిడి తగ్గి ఉత్సాహం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమణ , సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు జగన్ కోచ్ జయేశ్వరి మరియు సీనియర్ క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author