ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్ ను గురువారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద సిసి కెమేరాలతో చేసిన భధ్రతా ఏర్పాట్లను పరిశించిన అనంతరం పరిశీలన రిజిస్టర్ లో కలెక్టర్ సంతకం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖిలో భాగంగా ఈవిఎం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎం గోడౌన్ కు పటిష్ట భధ్రత కల్పించాసమన్నారు. ఎప్పటికప్పుడు గౌడౌన్ క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామని తెలిపారు. ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది ఉన్నరు.