NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూములను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్

1 min read

– ప్రభుత్వ భవనాలకు మరియు నేషనల్ హైవే రోడ్డు సంబంధించిన ల్యాండ్ అలినేషన్ (భూమి పరాయికరణ)

– ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్.:-

పల్లెవెలుగు వెబ్ ఆదోని: ప్రభుత్వ భవనాలకు మరియు నేషనల్ హైవే రోడ్డు సంబంధించిన ల్యాండ్ అలినేషన్ (భూమి పరాయికరణ) భూములను ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ నారాపు రెడ్డి మౌర్య పరిశీలించారు. బుధవారం ఆదోని పట్టణo లో అస్పరి రోడ్డులోని బైపాస్ రహదారి కి సంబంధించిన స్థల ప్రాంగణాన్ని మరియు ఏమ్మిగనూరు రోడ్డు లోని ఎస్. కొండాపూర్ గ్రామ సమీపంలో ఆర్టీవో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కపటి రోడ్డు నందు పౌర సరఫరాల గోడం, మరియు పెద్దకడబూరు మండలం హనుమపురం గ్రామ సమీపంలో పౌర సరఫరాల గోడం, కొరకు ప్రభుత్వ భవనాలు నిర్మించుటకు అధికారులు నివేదికల ప్రతిపాదనలు పంపిన  స్థలా ప్రాంతాలను క్షేతరస్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.

ప్రభుత్వ కార్యాలయలు తనిఖీ…ప్రభుత్వ కార్యాలయాలైన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం మరియు ఆదోని తహసిల్దార్ వారి కార్యాలయాన్ని  జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తనిఖీ చేశారు. కార్యాలయంలో ప్రతి సెక్షన్ ,  కంప్యూటర్ రూమ్, రికార్డు రూమ్ లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్యాలయం సిబ్బందికి జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, తహసిల్దార్ వెంకటలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ రజనీకాంత్ రెడ్డి, మండల సర్వేయర్ రమణ, తదితరులు పాల్గొన్నారు.

About Author