శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న జిల్లా కురువ సంఘం నాయకులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కల్లూరు మండలం పర్ల గ్రామంలో ఈరోజు శ్రీ భీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో కులజులు భక్తిశ్రద్దలతో, భీరప్ప డోళ్లు లతో సాంప్రదాయ బద్దంగా పూజాకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు,ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ జిల్లా కోశాధికారి కే.సి నాగన్న ఉమ్మడి జిల్లా గొర్రెల సహకార సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, పెద్దపాడు బీచుపల్లి జిల్లా నాయకులు బీసీ తిరుపాల్ , కల్లూరు మండలం నాయకులు కురువ శేఖర్,హుస్సేన్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ గుడి నిర్మాణం కోసం కృషి చేసిన కమిటీ సభ్యులకు, గ్రామ కులజులకు అభినందనలు తెలిపారు.