జిల్లా పోలీసు శాఖకు … నూతన జాగిలం హంటర్ ( డాగ్.)
1 min read

నూతన హంటర్ జాగిలాన్ని పరిశీలించిన…జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.
మంగళగిరి పోలీసు హెడ్ క్వార్టర్స్ నుండి జిల్లా కు చేరుకున్న కొత్త డాగ్
పేలుడు పదార్ధాలు గుర్తించడం లో శిక్షణ.
కర్నూలు, న్యూస్ నేడు: కేసుల చేధనలో , నేరస్థులను గుర్తించడంలో జిల్లా పోలీస్ శాఖ మరింత బలోపేతం అయ్యేందుకు నూతన జాగిలం హంటర్ జిల్లా పోలీసు శాఖకు రావడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.హంటర్ అనే నూతన జాగిలం ఎపి విజయవాడ మంగళగిరి హెడ్ క్వార్టర్స్ 6 వ బెటాలియన్ లో 10 నెలల పాటు పేలుడు పదార్ధాలు గుర్తించడం లో శిక్షణ పొందిందన్నారు. ఈ సంధర్బంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన నూతన జాగిలాం హంటర్ ను జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.కేసుల ఛేదనలో కీలకమైన జాగిలాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. డాగ్ స్క్వాడ్ మరింత సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేందుకు దోహదపడుతుందన్నారు. ఈ జాగిలoతో మొత్తం డాగ్ స్క్వాడ్ సంఖ్య 9 కి చేరుకుందన్నారు. హంటర్ అనే జాగిలం బెల్జియం మలనాయిస్ జాతికి చెందినదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ జావేద్, డాగ్ స్వాడ్ ఇంచార్జ్ ఎఆర్ కానిస్టేబుల్ రాజు, డాగ్ హ్యాండ్లర్ ఎఆర్ కానిస్టేబుల్ శేఖర్ పాల్గొన్నారు.

