NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు టిడ్కో గృహాల వద్ద 10 ఎకరాల్లో పారిశ్రామిక వాడ

1 min read


పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్

కర్నూలు, న్యూస్​ నేడు:   కర్నూలు శివారులోని టిడ్కో గృహాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్.. మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారాయణని ఈ కాలనీకి చెందిన పది ఎకరాల స్థలాన్ని ఎం ఎస్ ఎం ఈ క్రింద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇవ్వవలసిందిగా కోరగా అందుకు సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు చేపడతామని మంత్రి తెలియజేశారని దీనివలన ఈ కాలనీలో ఉండే వెయ్యి కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని మంత్రి టి.జి. భరత్ వివరించారు. ఈ గృహ సముదాయంలో ఉన్న జంగిల్ క్లియరెన్స్ను రేపు సాయంకాలం కి పూర్తి చేసి వాటికి సంబంధించిన ఫోటోలు మంత్రి నారాయణకి పంపాలని వారు ఆదేశించారు. అలాగే సోమవారంకు 6 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల కు విడుదల చేయడం జరుగుతుందన్నారు.1 కోటి రూపాయలతో రెండు నెలల లోపల  గృహాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించబడుతుంది.. దీనివలన సగం మంది ఈ గృహ సముదాయానికి వచ్చేస్తారని మరియు మిగిలిన 5 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు మొదలగు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు అంచలంచలుగా చేపట్టడం జరుగుతుందని మార్చి 31 వ తారీకు లోపల అన్ని సమస్యలు తీర్చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని రావడానికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడపాలి అందుకు కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో ఉండాలని అప్పుడే ప్రజలు కన్న కలలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సాకారం అవుతాయని మంత్రి టిజి భరత్ మీడియాకు తెలియజేశారు.

About Author