బాణసంచా దుకాణాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ
1 min read– ముందస్తు జాగ్రత్తలను అధికారుల పర్యవేక్షణలో పాటించాలి
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : దీపావళి పర్వదినాన్ని జిల్లా ప్రజలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని, సాధ్యమైనంత వరకు కాలుష్య రహిత టపాసులనే కాల్చాలని, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచించారు,టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,ముఖ్యంగా పిల్లలు పట్ల అప్రమత్తంగా ఉండాలని,పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లాలో బాణసంచా తయారీ లేదా విక్రయాలు లైసెన్సు కల్గిన దుకాణాల్లో మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బాణసంచా విక్రయంచాలి అని, ప్రభుత్వము వారి యొక్క అనుమతులు పొందిన బాణాసంచా లైసెన్సుదారులు బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకోని టపాసులు విక్రయించుకోవాలని, బాణసంచా విక్రయ షాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా నీరు,ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని,బాణసంచా దుకాణాలకు దూరంలో వాహనాలను నిలుపుకునేలా చూసుకోవాలని సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లైసెన్సులు లేకుండా ఎవరైనా టపాసులు తయారుచేసిన, నిల్వలు చేసినా,విక్రయాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.దీపావళి రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా,అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ కు 101,పోలీస్ డయల్.100, 8332959175 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9550351100 లకు తెలియ చెయ్యాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచాను ఎవ్వరైనా అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారాన్ని ఉంటే పోలీసులకు తెలియచేయాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ తెలియచేసినారు.