వృద్ధుల ఆశ్రమంలో జిల్లా ఎస్పీ జన్మదిన వేడుకలు
1 min read

జిల్లా నలుమూలల నుండి పోలీస్ అధికారులు చర్వాణిల ద్వారా, స్వయంగా శుభాకాంక్షలుతెలిపారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : నిరంతరం జిల్లా ప్రజల శాంతి భద్రతకు తమ సిబ్బందితో జిల్లా అంతట ఎక్కడ విఘతo కలుగా కుండా పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్న జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ జన్మదిన వేడుకలు నిడారంబరంగా వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ మధ్యలో కేక్ కోసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా నలుమూలలో ఉన్న పోలీస్ అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చరవాణిల ద్వారా మరియు స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వారికి కావలసిన నిత్యవసర సరుకులను, కాస్మెటిక్స్ కూడా జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ స్వయంగా వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనేకమంది వృద్ధులకు భోజనాన్ని స్వయంగా వడ్డించి స్వీట్లు తినిపించారు. వారంతా ఏలూరు జిల్లా ఎస్పీ ఆయురారోగ్యాలతో మరిన్ని మంచి సేవలు జిల్లా ప్రజలకు చేయాలని ఆయనను ఆశీర్వదించి దీవించారు.


