అవకతవకలకు పాల్పడిన విఓ ఏ మాకొద్దు
1 min read– అక్రమాలకు పాల్పడుతూ మహిళలకు మోసం చేస్తున్న వివో ఏ ను తొలగించాలి.. బయటపడుతున్న లీలలు.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పెసర వాయి గ్రామంలో అవకతవకలకు పాల్పడిన వివో ఏ మాకొద్దని గ్రామానికి చెందిన మహిళలు శుక్రవారం నాడు మండల పొదుపు సమాఖ్య భవనం వద్ద ఆందోళన నిర్వహించారు గ్రామం మొత్తం 50 గ్రూపులు ఉండగా అక్రమాలకు పాల్పడిన వివోఏ మాకొద్దని సంగపేట కాలనీ చెందిన పొదుపు గ్రూపుల మహిళలు తమ 20 గ్రూపులకు వేరొకరిని వివోఏ గా నియమించాలని డిమాండ్ చేశారు వివో ఏ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో బాధితులు తాము మోసపోయామని చైతన్య గ్రూపుకు చెందిన మహిళలు శ్రీనిధి రుణాన్ని రెండు లక్షలు తీసుకొని నెలకు ₹2,500 చొప్పున 24 నెలలు పూర్తిస్థాయిలో చెల్లించిన ఇంకా గ్రూపుపై 80000 అప్పు ఉందని సీసీ తెలపడంతో తాము మోసపోయామని న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు గతంలో గన్ని బ్యాగ్స్ మొక్కజొన్న రవాణా కోసం రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మార్క్ఫెడ్ అధికారులు చెల్లించిన మొత్తాన్ని పక్కదారి పట్టించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు పూర్తిస్థాయిలో అవినీతి వలలో చిక్కుకున్న మండల పొదుపు సమాఖ్య ను ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని మండలానికి చెందిన పొదుపు మహిళలు డిమాండ్ చేస్తున్నారు.