ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొద్దు.. కేంద్రం హెచ్చరిక
1 min readపల్లెవెలుగు వెబ్ : నిధి
కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మినిస్టరీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ విధించిన నిబంధనలు పాటించడంలో దాదాపు 348 కంపెనీలు విఫలమైనట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ముందు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నిధి కంపెనీల పట్ల గత ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేయడం ఇది రెండోసారి. కంపనీల చట్టం 2013, నిధి నిబంధనలు 2014ను అమలు చేయడంలో నిధి కంపెనీలు విఫలమయ్యాయని కేంద్రం తెలిపింది. నిధి కంపెనీలు బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థల పరిధిలోకి వస్తాయి.